
–52 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించిన రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి గురువారం ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోరెడ్డి నరసింహారెడ్డిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అలాగే మున్సిపాలిటీలోని 52 వార్డులకు పోటీ చేయనున్న కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలను ప్రకటించారు.
అభ్యర్థులకు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం
అభ్యర్థుల ప్రకటన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి వెళ్లాల్సిన విధానం, పార్టీ విధానాలను ప్రజలకు వివరించడం, విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాల్సిన అంశాలపై రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ దృష్టి
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో పార్టీ అభ్యర్థులు ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

