–ప్రతిభావంతులకు హైదరాబాద్ జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం
సలాం ప్రొద్దుటూరు:
భాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 11న ప్రొద్దుటూరులో జిల్లాస్థాయి NIDJAM అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక అనీ బీసెంట్ మునిసిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో ఉదయం 9.30 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయన్నారు.అండర్-14 విభాగంలో 17-11-2012 నుంచి 16-11-2014 మధ్య జన్మించిన బాలబాలికలకు ట్రయాథ్లాన్, కిడ్స్ జావెలిన్ పోటీలు నిర్వహిస్తారన్నారు. అండర్-16 విభాగంలో 17-11-2010 నుంచి 16-11-2012 మధ్య జన్మించిన వారికి 60 మీటర్లు, 600 మీటర్లు, లాంగ్ జంప్, హైజంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రో పోటీలు ఉంటాయన్నారు.కడప జిల్లాకు చెందిన అర్హులైన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను నవంబర్ 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో జరిగే జాతీయ స్థాయి NIDJAM పోటీలకు ఎంపిక చేస్తారనీ వివరించారు. జాతీయ పోటీలకు 12 సంవత్సరాలు నిండిన క్రీడాకారులు మాత్రమే అర్హులని తెలిపారు.క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా వెంట తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు. విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు భాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి వై. అహ్మర్ భాషా, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బసిరెడ్డి వీరే కళ్యాణ్ రెడ్డి తెలిపారు.వివరాలకు: 9949686586, 8019880995.
