–ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని ఆశ్రయించిన స్థానికులు
సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మండల పరిధిలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అమృతనగర్‌లో డంప్‌యార్డు ఏర్పాటు చేయవద్దని కోరుతూ స్థానికులు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ను బుధవారం కలిసి తమ సమస్యను వివరించారు.అమృతనగర్‌లో డంప్‌యార్డు ఏర్పాటు చేస్తే చెత్త నుంచి వెలువడే దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణం కారణంగా స్థానికులకు ఇబ్బందులు పడుతున్నారని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.స్థానికుల సమస్యను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విన్నారు. సమస్యను పరిశీలించి తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే స్పందనపై అమృతనగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు.

