11న ప్రొద్దుటూరులో జిల్లాస్థాయి NIDJAM అథ్లెటిక్స్

  –ప్రతిభావంతులకు హైదరాబాద్ జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం   సలాం   ప్రొద్దుటూరు: భాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 11న ప్రొద్దుటూరులో జిల్లాస్థాయి NIDJAM అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక అనీ బీసెంట్ మునిసిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో ఉదయం 9.30 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయన్నారు.అండర్-14 విభాగంలో 17-11-2012 నుంచి 16-11-2014 మధ్య జన్మించిన బాలబాలికలకు ట్రయాథ్లాన్, కిడ్స్ జావెలిన్ పోటీలు నిర్వహిస్తారన్నారు. అండర్-16 విభాగంలో 17-11-2010 నుంచి 16-11-2012 మధ్య జన్మించిన వారికి 60 మీటర్లు, 600 మీటర్లు,...