ePaper
Sunday, October 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్దస్తగిరిపేటలో భక్తిశ్రద్ధలతో దస్తగిరి స్వామి పవిత్ర కేశాల దర్శనం

దస్తగిరిపేటలో భక్తిశ్రద్ధలతో దస్తగిరి స్వామి పవిత్ర కేశాల దర్శనం

📰 Generate e-Paper Clip

 

సలాం   ప్రొద్దుటూరు:

పట్టణంలోని దస్తగిరిపేటలో ఆస్తానా-ఏ-కమలియా ప్రొద్దుటూరు పీఠాధిపతి హజ్రత్ సయ్యద్ షా అబిదుల్లా హుస్సైని ఖాద్రీ ఆధ్వర్యంలోని ఖాన్ఖాలో శనివారం దస్తగిరి స్వామి పవిత్ర కేశాల దర్శన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా హజ్రత్ సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహ్మతుల్లాహి అలైహి (దస్తగిరి స్వామి) పవిత్ర కేశాలను భక్తుల దర్శనార్థం ఉంచారు. అలాగే మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర కేశాలను కూడా భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పవిత్ర కేశాలను దర్శించుకుని ప్రార్థనలు చేశారు.సాయంత్రం అసర్ నమాజ్ అనంతరం ఫకీర్ల ఆధ్వర్యంలో దస్తగిరి స్వామి భక్తి గీతాలు, ఖసీదాలు ఆలపించారు. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై నాత్-ఏ-షరీఫ్‌ను భక్తిశ్రద్ధలతో పఠించారు. దీంతో ఖాన్ఖా పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.కార్యక్రమానికి హజ్రత్ డాక్టర్ సయ్యద్ షా ఆరిఫ్ హుస్సైని ఖాద్రీ, హజ్రత్ సయ్యద్ షా ఎహ్సానుల్లా హుస్సైని ఖాద్రీ, హజ్రత్ సయ్యద్ షా సాబిర్ పాషా ఖాద్రీ, హజ్రత్ సయ్యద్ షా అలావుద్దీన్ పీరాన్ ఖాద్రీ, హజ్రత్ సయ్యద్ అమీన్‌ఉద్దీన్ హుస్సైని, సయ్యద్ మతీన్ హుస్సైని తదితర పీఠాధిపతులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆస్తానా-ఏ-కమలియా పీఠాధిపతి వారిని శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం భక్తుల కోసం నిర్వాహకులు సుమారు 2,000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో కార్యక్రమం వైభవంగా జరిగింది.

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!