ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్మున్సిపల్ ఆస్తులకు రక్షణ.. ప్రొద్దుటూరుకు సుందరీకరణ శోభ!

మున్సిపల్ ఆస్తులకు రక్షణ.. ప్రొద్దుటూరుకు సుందరీకరణ శోభ!

📰 Generate e-Paper Clip

 

 

–ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలి..

–పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి: జాయింట్ కలెక్టర్ నిధి మీనా

 

సలాం  ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్ ఆస్తులను పరిరక్షిస్తూ, పట్టణ సుందరీకరణకు సమగ్ర చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్, మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి నిధి మీనా మున్సిపల్ అధికారులను ఆదేశించారు.బుధవారం స్థానిక శివాలయం సర్కిల్‌లోని మున్సిపల్ స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్తో కలిసి జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. మున్సిపల్ స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.మున్సిపాలిటీకి చెందిన స్థలాలకు హద్దులు స్పష్టంగా గుర్తించి, భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలకు తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఆస్తులను పరిరక్షించడం, వాటిని ప్రజోపయోగంగా వినియోగించడంతో పాటు పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.శివాలయం సర్కిల్‌లోని మున్సిపల్ స్థలాన్ని సుందరీకరించేందుకు అవసరమైన పనులపై డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేయాలని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్ను జాయింట్ కలెక్టర్ నిధి మీనా ఆదేశించారు.పట్టణంలోని మున్సిపల్ ఆస్తుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, అందుబాటులో ఉన్న స్థలాలను పచ్చదనం, సుందరీకరణతో అభివృద్ధి చేయాలని ఆమె స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!