మున్సిపల్ ఆస్తులకు రక్షణ.. ప్రొద్దుటూరుకు సుందరీకరణ శోభ!
–ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలి.. –పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి: జాయింట్ కలెక్టర్ నిధి మీనా సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్ ఆస్తులను పరిరక్షిస్తూ, పట్టణ సుందరీకరణకు సమగ్ర చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్, మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి నిధి మీనా మున్సిపల్ అధికారులను ఆదేశించారు.బుధవారం స్థానిక శివాలయం సర్కిల్‌లోని మున్సిపల్ స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్తో కలిసి జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. మున్సిపల్ స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించి ఆకర్షణీయంగా...