ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్చాపాడు ZP హైస్కూల్‌లో ఏకగ్రీవంగా SMC ఎన్నికలు

చాపాడు ZP హైస్కూల్‌లో ఏకగ్రీవంగా SMC ఎన్నికలు

📰 Generate e-Paper Clip

 

 

–చైర్మన్‌గా మంగపట్నం సుబ్రమణ్యం.. వైస్ చైర్మన్‌గా సుప్రజ ఎన్నిక

 

సలాం ప్రొద్దుటూరు – చాపాడు:

మండలంలోని చాపాడు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు సోమవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో SMC చైర్మన్‌గా మంగపట్నం సుబ్రమణ్యం, వైస్ చైర్మన్‌గా సుప్రజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎన్నికల ప్రక్రియలో చాపాడు, పల్లవోలు తదితర గ్రామాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా నూతన SMC కమిటీని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌కు పలువురు అభినందనలు తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు, పాఠశాల అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల కోసం SMC కమిటీ సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చాపాడు, పల్లవోలు మాజీ సర్పంచులు అక్బర్ సలీం, మొగిలి రామమోహన్, టీడీపీ సీనియర్ నాయకులు రాజోలి బయాపు రెడ్డి, పార్లమెంట్ మైనార్టీ కార్యదర్శి అక్బర్ సలీం, బత్తల కిరణ్ బాబు, మంగపట్నం మస్తానయ్య, రవి, రాహుల్, దస్తగిరి, నూరుల్లా తదితరులు పాల్గొన్నారు. అలాగే పలు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని నూతన SMC కమిటీకి అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!