ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు HPV టీకా

గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు HPV టీకా

📰 Generate e-Paper Clip

–కామనూరు పీహెచ్‌సీలో టీకా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

సలాం ప్రొద్దుటూరు:

గర్భాశయ ముఖ క్యాన్సర్‌ను నివారించే దిశగా 14 సంవత్సరాల బాలికలకు నిర్వహిస్తున్న HPV టీకా కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా బాలికలకు HPV టీకా ప్రాధాన్యత, గర్భాశయ ముఖ క్యాన్సర్‌ నివారణలో టీకా ద్వారా కలిగే ప్రయోజనాలపై వైద్య సిబ్బందితో వివరాలు తెలుసుకున్నారు. బాలికల ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి టీకా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ మంజులతో పాటు ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!