ePaper
Monday, September 28, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్దస్తగిరి స్వామి పవిత్ర స్మరణతో.. మార్మోగిన దస్తగిరిపేట..

దస్తగిరి స్వామి పవిత్ర స్మరణతో.. మార్మోగిన దస్తగిరిపేట..

📰 Generate e-Paper Clip

–11వి మంజాలిస్ పఠనం పూర్తి..

– గంధం, పెద్ద జెండాల ఊరేగింపునకు సర్వం సిద్ధం

సలాం ప్రొద్దుటూరు:

దస్తగిరి స్వామి వారి పవిత్ర స్మరణ, జిక్ర్‌తో దస్తగిరిపేట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పట్టణంలోని దస్తగిరిపేట వీధిలో గల హజరత్  మహబూబ్ సుబహాని సయ్యద్ అబ్దుల్ ఖాదీర్ జిలానీ (దస్తగిరి స్వామి జెండా చెట్టు) రహ్మతుల్లాహి అలైహి  వద్ద నిర్వహిస్తున్న దస్తగిరి స్వామి వారి జీవిత చరిత్ర 11వి మంజాలిస్ పుస్తక పఠనం శనివారం రాత్రి భక్తిశ్రద్ధలతో ముగిసింది.
మంజాలిస్ సందర్భంగా దస్తగిరి స్వామి వారి జీవిత విశేషాలను పఠిస్తూ, వారి ఆధ్యాత్మిక బోధనలు, సేవా సందేశాన్ని స్మరించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జిక్ర్, ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు. దీంతో దర్గా పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.

ప్రముఖ ఆధ్యాత్మిక పెద్దలకు ఘన సత్కారం

11వి మంజాలిస్ ముగింపు సందర్భంగా దర్గా కమిటీ తరఫున ఎం.ఎస్. అలీబాషా ఖాద్రి అల్ చిష్టి సాహెబ్, ఆయన కుమారుడు ఎం.ఎస్. ఇలియాస్, అస్థానే కమలియా పీఠాధిపతులు డాక్టర్ సయ్యద్ ఆరీఫుల్లా హుసేని ఖాద్రి సాహెబ్, అల్ హజ్ సయ్యద్ ఆబీదుల్లా హుసేని ఖాద్రి సాహెబ్లను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఫాతేహ (చదివింపులు) అనంతరం భక్తులకు పంచారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ దస్తావేజు లేఖరి ఎస్. అక్బర్ వలీ, ఎం.ఎస్. లతీఫ్, కిరాణా వ్యాపారి ఎస్. అన్వర్, కూరగాయల వ్యాపారి అబ్దుల్ ఖాదర్, దర్గా కమిటీ సభ్యులు, దస్తగిరి స్వామి భక్తులు పాల్గొన్నారు.
రేపు గంధం సందర్భంగా పెద్ద జెండాల ఊరేగింపు
దస్తగిరి స్వామి గంధం సందర్భంగా సెప్టెంబర్ 27, ఆదివారం సాయంత్రం దస్తగిరిపేటలో పెద్ద జెండాల ఊరేగింపును ఘనంగా నిర్వహించనున్నట్లు దర్గా కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
అలాగే సెప్టెంబర్ 28, సోమవారం మధ్యాహ్నం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గంధం, జెండాల ఊరేగింపు కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు.
భక్తులందరికీ సాదర ఆహ్వానం
గంధం, పెద్ద జెండాల ఊరేగింపు, అన్నదాన కార్యక్రమాల్లో భక్తులు, ఆధ్యాత్మిక అభిమానులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించి, అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని దర్గా కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దస్తగిరి స్వామి వారి ఆధ్యాత్మిక సందేశం, సేవాభావం, సోదరభావం సమాజంలో మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
ఈ పవిత్ర కార్యక్రమాలకు భక్తులందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!