ePaper
Monday, September 28, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్వార్డుల వారీగా జనసేన కసరత్తు.. ఆశావహుల నుంచి వినతుల స్వీకరణ

వార్డుల వారీగా జనసేన కసరత్తు.. ఆశావహుల నుంచి వినతుల స్వీకరణ

📰 Generate e-Paper Clip

 

–ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి..

–కూటమి సమన్వయంతో ముందుకు వెళ్లేలా కార్యాచరణ

 

సలాం  ప్రొద్దుటూరు:

స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణలో భాగంగా జనసేన పార్టీ ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ ఉమ్మడి కడప జిల్లా ఇన్‌చార్జిగా వచ్చిన దేవ వరప్రసాద్ ప్రొద్దుటూరులో పార్టీ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఆశావహులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలోని వార్డుల వారీగా పార్టీ బలాబలాలు, స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, ప్రత్యర్థి పార్టీల పరిస్థితి తదితర అంశాలపై ఆశావహుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆయా వార్డుల్లో పార్టీకి ఉన్న బలాన్ని మరింత పెంచేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలతో సమన్వయం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్లాల్సిన అవసరంపై నాయకులతో చర్చించారు. ప్రతి వార్డులో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ విజయం సాధిస్తామని తెలిపిన ఆశావహుల నుంచి వినతులను స్వీకరించారు.ఆశావహుల నుంచి సేకరించిన వివరాలను పార్టీ అధిష్ఠానానికి నివేదించి, కూటమి భాగస్వామ్య పార్టీలతో చర్చించిన అనంతరం అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకునేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు నాయకులు తెలిపారు. వార్డుల వారీగా క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసి ఎన్నికల కోసం పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేటర్ జీవీ రమణ, కడప జిల్లా ఇన్‌చార్జి సుంకర శ్రీనివాస్, పండ్ర రంజిత్, అక్కిదాసరి రామారావు, మంచి శివకుమార్, రామోజీ ప్రసాద్, మురళీకృష్ణ, POC శివకళ్యాణ్ రెడ్డి, మంచాల సంజీవ్, మదసు మురళి, షోయబ్, అశోక్, విజయ్, రంగస్వామి, రాము, మధు, నాగేంద్ర, లక్ష్మణ్, పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!