దస్తగిరి స్వామి పవిత్ర స్మరణతో.. మార్మోగిన దస్తగిరిపేట..
–11వి మంజాలిస్ పఠనం పూర్తి.. – గంధం, పెద్ద జెండాల ఊరేగింపునకు సర్వం సిద్ధం సలాం ప్రొద్దుటూరు: దస్తగిరి స్వామి వారి పవిత్ర స్మరణ, జిక్ర్‌తో దస్తగిరిపేట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పట్టణంలోని దస్తగిరిపేట వీధిలో గల హజరత్ మహబూబ్ సుబహాని సయ్యద్ అబ్దుల్ ఖాదీర్ జిలానీ (దస్తగిరి స్వామి జెండా చెట్టు) రహ్మతుల్లాహి అలైహి వద్ద నిర్వహిస్తున్న దస్తగిరి స్వామి వారి జీవిత చరిత్ర 11వి మంజాలిస్ పుస్తక పఠనం శనివారం రాత్రి భక్తిశ్రద్ధలతో ముగిసింది. మంజాలిస్ సందర్భంగా దస్తగిరి స్వామి వారి...