ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిప్రొద్దుటూరులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం

ప్రొద్దుటూరులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

 

–రోటరీ ఐ హాస్పిటల్‌లో సెప్టెంబర్ 27న శిబిరం.. ప్రజలు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలి

 

సలాం   ప్రొద్దుటూరు:

క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రొద్దుటూరులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు ప్రతినిధులు తెలిపారు.రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు అధ్యక్షులు కొవ్వూరు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో, రోటరీ ఐ హాస్పిటల్ ప్రొద్దుటూరు అధ్యక్షులు ఎం.వి.ఎన్. ప్రభు సహకారంతో ఈ శిబిరాన్ని సెప్టెంబర్ 27, ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రోటరీ ఐ హాస్పిటల్ ప్రొద్దుటూరులో నిర్వహించనున్నారు.ఈ వైద్య శిబిరాన్ని కిమ్స్ సవేరా హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరంలో క్యాన్సర్‌కు సంబంధించిన ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు, వైద్యుల సలహాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.

 

ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరపత్రం విడుదల

 

ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం గురించి ప్రజలకు విస్తృతంగా తెలియజేసేందుకు రూపొందించిన కరపత్రాన్ని మంగళవారం విడుదల చేశారు. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం ద్వారా చికిత్సను సకాలంలో ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని, అందువల్ల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

 

ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలి

 

శిబిరానికి హాజరుకావాలనుకునే ప్రజలు రోటరీ ఐ హాస్పిటల్‌లో లేదా కరపత్రంలో పేర్కొన్న ఫోన్ నంబర్‌కు సంప్రదించి తమ పేర్లు, వివరాలను ముందస్తుగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి గండ్లూరు శ్రీధర్ శర్మ, రోటరీ ఐ హాస్పిటల్ సెక్రటరీ బేపారి జాకీర్ అహ్మద్, పాస్ట్ ప్రెసిడెంట్లు గుర్రం రామకృష్ణ, తిరుమల బాల సూర్యరావు, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ కె. రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రోటరీ క్లబ్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!