–డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిశీలించిన మున్సిపల్ అధికారులు
సలాం ప్రొద్దుటూరు –మైదుకూరు:
పట్టణంలోని 9వ వార్డులో నెలకొన్న డ్రైనేజీ, రోడ్లు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వార్డు ప్రజల తరఫున పట్టణ ప్రధాన కార్యదర్శి రాకెట్ రఫీ ఆధ్వర్యంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కు వినతిపత్రం అందజేశారు.
వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్రం ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సమస్యలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపల్ ఏఈ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు 9వ వార్డులో పర్యటించి డ్రైనేజీ, రోడ్లు తదితర సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యల ప్రక్రియను ప్రారంభించారు.
ప్రజల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, అధికారుల ద్వారా పరిష్కార చర్యలు చేపట్టేలా చేసినందుకు రాకెట్ రఫీ వార్డు ప్రజల తరఫున ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు.

