9వ వార్డు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి – వెంటనే స్పందన
–డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిశీలించిన మున్సిపల్ అధికారులు సలాం ప్రొద్దుటూరు –మైదుకూరు: పట్టణంలోని 9వ వార్డులో నెలకొన్న డ్రైనేజీ, రోడ్లు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వార్డు ప్రజల తరఫున పట్టణ ప్రధాన కార్యదర్శి రాకెట్ రఫీ ఆధ్వర్యంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్రం ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సమస్యలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను...