–ప్రైవేట్ డిగ్రీ, బి.ఎడ్. కళాశాలల అసోసియేషన్ల నాయకులు
సలాం ప్రొద్దుటూరు –కడప :
యోగి వేమన యూనివర్సిటీ నూతన రెక్టార్‌గా ప్రొఫెసర్ ఏ.జి. దాము, రిజిస్ట్రార్‌గా ఎన్.సి. గంగిరెడ్డి నియమితులైన సందర్భంగా వై.వి.యూ. ప్రైవేట్ డిగ్రీ కాలేజీ అసోసియేషన్ మరియు బి.ఎడ్. కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపి ఘనంగా సన్మానం చేశారు .ఈ సందర్భంగా యాజమాన్యంతో నూతన రెక్టార్ ప్రొఫెసర్ ఏ.జి. దాము మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల విద్యా ప్రమాణాలు, అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి యూనివర్సిటీ అన్ని విధాలా సహకారం అందిస్తుందని తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువస్తే, నిబంధనల పరిధిలో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.రిజిస్ట్రార్ ఎన్.సి. గంగిరెడ్డి మాట్లాడుతూ కళాశాలలు అకాడమిక్ మరియు అడ్మినిస్ట్రేటివ్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ, విద్యా పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్. విజయ్ కుమార్, సెక్రటరీ జి. శీను, కళాశాలల కరెస్పాండెంట్లు పోలా రమణ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, రాఘవ, సంజీవ, ప్రవీణ్, బాల్ రెడ్డి, నితీష్, భరత్, నారాయణ వర్మ, రవి శేఖర్ రెడ్డి తదితరులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
