ePaper
Saturday, September 12, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్రెండు విడతల డీఏ విడుదలపై ఎన్జీవో నేతల హర్షం

రెండు విడతల డీఏ విడుదలపై ఎన్జీవో నేతల హర్షం

📰 Generate e-Paper Clip

 

 

–ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ చొరవ అభినందనీయం

–జె. రామసుబ్బయ్య యాదవ్

 

సలాం ప్రొద్దుటూరు:

ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు విడతల కరువు భత్యం (డీఏ) విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై కడప జిల్లా ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు, జేఏసీ ఛైర్మన్ జె. రామసుబ్బయ్య యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.

 

ఈ నెల 5వ తేదీన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ రెండు విడతల డీఏ విడుదలకు ఉత్తర్వులు జారీ చేయడం ఉద్యోగుల్లో సానుకూల వాతావరణాన్ని కల్పించిందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు.

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు, జేఏసీ ఛైర్మన్ అలపర్తి విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి. రమణ, కడప జిల్లా అధ్యక్షులు బి. శ్రీనివాసులు తదితరులకు జె. రామసుబ్బయ్య యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.

 

అదేవిధంగా ప్రొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ నాయకులు, జేఏసీ ప్రతినిధులు అశోక్ కుమార్, సదాశివయ్య, నాగార్జున, వరప్రసాద్, ప్రభంజన్ రెడ్డి, ఓంకార్ తదితరులు ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాల నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

 

ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ప్రభుత్వం హామీ ఇచ్చిన మిగిలిన డిమాండ్లను కూడా త్వరితగతిన పరిష్కరించాలని ఎన్జీవో నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కులు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!