ePaper
Saturday, September 12, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్టీడీపీలో చేరిన నందలూరు జడ్పీటీసీ ఉషారాణి

టీడీపీలో చేరిన నందలూరు జడ్పీటీసీ ఉషారాణి

📰 Generate e-Paper Clip

 

 

–భూపేష్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న నాయకులు

 

సలాం ప్రొద్దుటూరు –కడప:

నందలూరు జడ్పీటీసీ ఉషారాణి తెలుగుదేశం పార్టీలో చేరారు. కడప నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ పెళ్లకూరి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఆమెతో పాటు పలువురు నాయకులు టీడీపీలో చేరారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ ఉషారాణితో పాటు గడికోట వెంకట సుబ్బారెడ్డి, యతీశ్వర్ రెడ్డి, కృష్ణారెడ్డి, వాణిరెడ్డి తదితరులకు భూపేష్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

 

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి

 

ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీలో చేరిన నాయకులు, కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీకి మరింత ప్రజాదరణ తీసుకురావాలని సూచించారు.కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జబివుల్లాతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!