ePaper
Friday, September 11, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఎమ్మెల్యే చొరవతో.. గంటల్లోనే వీధి దీపాల సమస్యకు పరిష్కారం!

ఎమ్మెల్యే చొరవతో.. గంటల్లోనే వీధి దీపాల సమస్యకు పరిష్కారం!

📰 Generate e-Paper Clip

 

 

–9వ వార్డులో కొత్త వీధి దీపాల ఏర్పాటు

 

– ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు వార్డు ప్రజల కృతజ్ఞతలు

 

సలాం ప్రొద్దుటూరు –మైదుకూరు:

మైదుకూరు పట్టణంలోని 9వ వార్డులో వీధి దీపాలు లేక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ చొరవతో తక్షణ పరిష్కారం లభించింది. వార్డులో వీధి దీపాలు పనిచేయకపోవడం, రాత్రివేళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.సమస్యను తెలుసుకున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ వెంటనే స్పందించి, మున్సిపల్‌ ఏఈ నిరంజన్‌రెడ్డిని సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి కొన్ని గంటల్లోనే కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించారు.దీంతో 9వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను తన దృష్టికి వచ్చిన వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు ఎమ్మెల్యే చొరవ చూపుతున్నారని మైదుకూరు పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి రాకెట్‌ రఫీ పేర్కొన్నారు.

 

ప్రజా సమస్యలపై తక్షణ స్పందన

 

నీటి సమస్యలు, వీధి దీపాలు తదితర ప్రజా సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువస్తే సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రాకెట్‌ రఫీ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.సమస్యను తక్షణమే పరిష్కరించిన మున్సిపల్‌ ఏఈ నిరంజన్‌రెడ్డి, మున్సిపల్‌ సిబ్బందికి కూడా రాకెట్‌ రఫీతో పాటు 9వ వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!