ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్యువతలో క్రీడా స్ఫూర్తి.. టీడీపీ ప్రోత్సాహం!

యువతలో క్రీడా స్ఫూర్తి.. టీడీపీ ప్రోత్సాహం!

📰 Generate e-Paper Clip

–TNSF క్రికెట్ టోర్నమెంట్‌లో ఛాంపియన్‌గా యోగివేమన ఇంజనీరింగ్ కళాశాల
–రన్నరప్‌గా SRIT.. విజేతలకు ఘన అభినందనలు తెలిపిన టీడీపీ యువనాయకులు నంద్యాల కొండారెడ్డి

 

సలాం ప్రొద్దుటూరు:

చదువుతో పాటు క్రీడల్లోనూ యువత రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టీడీపీ యువనాయకులు నంద్యాల కొండారెడ్డి పిలుపునిచ్చారు. క్రీడా ప్రతిభను వెలికితీసి యువతలో పోటీతత్వం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించాలనే లక్ష్యంతో కడప జిల్లా TNSF ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా ముగిసింది.ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో కడప జిల్లా వ్యాప్తంగా UG, PG విద్యార్థులతో కూడిన 16 జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నాయి. ఫైనల్ పోరులో యోగివేమన ఇంజనీరింగ్ కళాశాల జట్టు విజేతగా నిలిచి ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకోగా, SRIT ఇంజనీరింగ్ కళాశాల జట్టు రన్నరప్‌గా నిలిచింది.

క్రీడలు యువతకు బలమైన పునాది”

ఈ సందర్భంగా నంద్యాల కొండారెడ్డి మాట్లాడుతూ.. “విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా క్రీడా మైదానాల్లోనూ తమ ప్రతిభను నిరూపించుకోవాలి. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించే స్ఫూర్తిని క్రీడలు నేర్పుతాయి” అని అన్నారు.టోర్నమెంట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి సాధించిన యోగివేమన ఇంజనీరింగ్ కళాశాల జట్టుకు, ద్వితీయ బహుమతి పొందిన SRIT ఇంజనీరింగ్ కళాశాల జట్టుకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించే ఇలాంటి టోర్నమెంట్లను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కడప జిల్లా నుంచి జాతీయ స్థాయికి ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎదగాలని ఆకాంక్షించారు.

యువతలో జోష్.. టోర్నమెంట్‌కు భారీ స్పందన

16 జట్లు పాల్గొనడంతో టోర్నమెంట్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఫైనల్ మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లు తీవ్రంగా పోరాడగా, చివరకు యోగివేమన ఇంజనీరింగ్ కళాశాల జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. విజేతలు, రన్నరప్ జట్లకు నాయకులు, నిర్వాహకులు అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో TDP కడప పార్లమెంట్ అధ్యక్షులు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ ముక్తియార్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహ్మద్, TDP కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబీవుల్లా, పార్లమెంట్ ఉపాధ్యక్షులు డాక్టర్ నజీముద్దీన్, టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి, మార్కెట్ కమిటీ ఇన్‌చార్జ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.అలాగే TDP పట్టణ మాజీ అధ్యక్షులు ఈవీ సుధాకర్ రెడ్డి, బచ్చల ప్రతాప్, యోగివేమన ఇంజనీరింగ్ కళాశాల నాన్ టీచింగ్ యూనియన్ అధ్యక్షులు రసూల్ గౌస్, శివాలయం మాజీ చైర్మన్ పల్లా శంకర్ నారాయణ, రిటైర్డ్ ఎస్‌ఐ శంకర్, యనమల సుబ్బిరెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మల్లికార్జున, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సుధాకర్, జనసేన నాయకులు సుంకర మురళి, నూరి, బాబు తదితరులు హాజరయ్యారు.TNSF కడప జిల్లా అధ్యక్షులు బొజ్జా తిరుమలేష్, ప్రధాన కార్యదర్శి చేతన్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొని టోర్నమెంట్‌ను విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!