–అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సమీక్ష
సలాం ప్రొద్దుటూరు – రాజుపాలెం:
ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. మండల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, స్థానిక సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.సమావేశంలో ఎంపీడీఓ సురేష్ బాబు, ఎంఆర్ఓ హరినాథ్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


