రాజుపాలెం మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే వరద
–అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సమీక్ష సలాం ప్రొద్దుటూరు – రాజుపాలెం: ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. మండల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, స్థానిక సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే...