ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఎడిటోరియల్శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి మిరవరి సేవలో భక్తుల సందడి

శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి మిరవరి సేవలో భక్తుల సందడి

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరులోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా స్వామి, అమ్మవార్ల మిరవరి సేవను ఆలయ దేవస్థానం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఆలయం లోపల స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక మిరవరి సేవ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకుని అనుగ్రహం పొందారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

 

కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కే.వి. రమణ, ఆలయ చైర్మన్ వంగల నారాయణ రెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొని స్వామివారి సేవలో భాగస్వాములయ్యారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!