శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి మిరవరి సేవలో భక్తుల సందడి
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా స్వామి, అమ్మవార్ల మిరవరి సేవను ఆలయ దేవస్థానం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఆలయం లోపల స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక మిరవరి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకుని అనుగ్రహం పొందారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కే.వి. రమణ, ఆలయ చైర్మన్...