ePaper
Thursday, October 22, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్విశిష్ట సేవలకు పోలీస్ అధికారులకు సేవా పతకాలు

విశిష్ట సేవలకు పోలీస్ అధికారులకు సేవా పతకాలు

📰 Generate e-Paper Clip

 

–ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట సేవా పతకాలు ప్రదానం చేసిన జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్

 

సలాం ప్రొద్దుటూరు –కడప:

2025 సంవత్సరంలో పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించిన ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట సేవా పతకాలను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రదానం చేశారు.ఈ సందర్భంగా పతకాలు అందుకున్న అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ, ప్రజాసేవకు గుర్తింపుగా ఈ పతకాలు లభించడం అభినందనీయమన్నారు. మున్ముందు కూడా ఇదే స్ఫూర్తితో విధులు నిర్వర్తిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింత పెంచాలని ఆకాంక్షించారు.

 

ఉత్కృష్ట సేవా పతక గ్రహీతలు

 

1. బాలమద్దిలేటి, సీఐ, చింతకొమ్మదిన్నె పీఎస్

2. వి. శ్రీధర్ బాబు, పీసీ-202, కడప ట్రాఫిక్ పీఎస్

3. ఎం. అబ్దుల్ సలాం, పీసీ-423, డీసీఆర్‌బీ, కడప

4. పి. సుధాకర్, హెచ్‌సీ-534, రాజుపాలెం పీఎస్

5. ఎం. మహేష్, పీసీ-709, దువ్వూరు పీఎస్

6. డి. వెంకట భార్గవ్, పీసీ-797, సీకే దిన్నె పీఎస్

7. ఈ. విశ్వనాథ్, పీసీ-1137, ఐటీ కోర్ టీమ్

8. ఆర్. వీరాంజనేయులు, పీసీ-2072, ప్రొద్దుటూరు III టౌన్ పీఎస్

9. పి. మహేష్ కుమార్ రావు, పీసీ-2128, పెద్దముడియం పీఎస్

10. ఎస్. రామమోహన్ రెడ్డి, ఏఆర్‌పీసీ-1804, డీఏఆర్, కడప

11. ఎస్. జాఫర్ బాషా, ఏఆర్‌పీసీ-1814, డీఏఆర్, కడప

 

అతి ఉత్కృష్ట సేవా పతక గ్రహీతలు

 

1. ఎస్. అక్బర్ అలీ, ఏఎస్ఐ-549, ఐటీ కోర్ టీమ్

2. ఎస్. అహ్మద్ అలీ, హెచ్‌సీ-1634, ఏహెచ్‌టీయూ

3. ఎస్. సూర్యప్రకాశ్ రావు, హెచ్‌సీ-1545

4. ఎస్. వెంకట సుబ్బయ్య, హెచ్‌సీ-1496, బద్వేల్ యూజీ పీఎస్

5. ఎస్. మహబూబ్ బాషా, హెచ్‌సీ-1424, జమ్మలమడుగు యూజీ పీఎస్

6. పి. నరసయ్య, పీసీ-3277, ప్రొద్దుటూరు II టౌన్ యూజీ పీఎస్

7. వై. శ్రీనివాసులు, హెచ్‌సీ-1963, కడప I టౌన్ యూజీ పీఎస్

8. ఎం. శివరామయ్య, ఏఆర్‌హెచ్‌సీ-2481, డీఏఆర్, కడప

9. ఎల్. రమణారెడ్డి, ఏఆర్‌హెచ్‌సీ-1222, డీఏఆర్, కడప

10. జి. నాగేశ్వరయ్య, పీసీ-1564, మన్నూరు పీఎస్

 

పోలీస్ విధుల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి సేవా పతకాలకు ఎంపికైన అధికారులు, సిబ్బందికి జిల్లా పోలీస్ అధికారులు, సహచర సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సేవా పతకాలు అందుకోవడం ఇతర పోలీసు సిబ్బందికి సైతం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!