సలాం ప్రొద్దుటూరు:
పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల సందర్భంగా మంగళవారం స్థానిక పాత మార్కెట్లోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో చిరంజీవి పేరుతో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మెగా అభిమానులు చిరంజీవి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ఆయనకు శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించారు.కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు రామారావుతో పాటు మధుస్వామి, మధు చిరు రాయల్, షరీఫ్ టైర్స్, రాము, బాబు రావు, చెన్న రవి, బియ్యం కేశవ, నంద మెగా శ్యామ్ తదితర మెగా అభిమానులు పాల్గొన్నారు.
