ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరే లక్ష్యం–ఎమ్మెల్యే వరద

ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరే లక్ష్యం–ఎమ్మెల్యే వరద

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలక సంఘం ఆధ్వర్యంలో అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో స్వచ్ఛ సంకల్ప దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు.ముందుగా ఎమ్మెల్యే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. నేటి నుంచి ప్రొద్దుటూరు పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, స్వచ్ఛమైన, పర్యావరణహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలి ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాలను ప్రతి ఒక్కరూ గుర్తించి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, వ్యాపారస్తులు సమష్టిగా భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

 

ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం మున్సిపల్ కమిషనర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అభినందించారు. పట్టణంలో పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు.ప్రజలు, వ్యాపారస్తులు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలను వినియోగిస్తూ దాని వాడకాన్ని క్రమంగా తగ్గించాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడటం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన సమాజాన్ని అందించగలమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు నిర్మాణానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీఎస్ ముక్తియార్, మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్, ఎంఈఓ సావిత్రమ్మ, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

 

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!