ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరే లక్ష్యం–ఎమ్మెల్యే వరద
సలాం ప్రొద్దుటూరు: పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలక సంఘం ఆధ్వర్యంలో అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో స్వచ్ఛ సంకల్ప దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు.ముందుగా ఎమ్మెల్యే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. నేటి నుంచి ప్రొద్దుటూరు పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, స్వచ్ఛమైన, పర్యావరణహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని...