ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్5వ వార్డులో టీడీపీ ‘డోర్ టు డోర్’

5వ వార్డులో టీడీపీ ‘డోర్ టు డోర్’

📰 Generate e-Paper Clip

 

 

–కూటమి రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు అవగాహన

 

సలాం   ప్రొద్దుటూరు:

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 5వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు.

 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు, నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి సూచనలతో మాజీ కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

 

టీడీపీ నాయకులు, కార్యకర్తలు వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను తెలియజేస్తూ అవగాహన కల్పించారు.

 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడమే డోర్ టు డోర్ కార్యక్రమం లక్ష్యమన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

 

కార్యక్రమంలో నంద్యాల శంకర్ రెడ్డితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!