ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఎడిటోరియల్మైదుకూరు 5వ వార్డులో ఘనంగా ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమం

మైదుకూరు 5వ వార్డులో ఘనంగా ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

 

సలాం  ప్రొద్దుటూరు (మైదుకూరు):

మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు మైదుకూరు మున్సిపాలిటీ 5వ వార్డులో ‘ఇంటింటికి టీడీపీ’ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వార్డు ఇన్‌చార్జ్ షేక్ అల్తాఫ్ హుస్సేన్, నాయిని శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనాలను నాయకులు వివరించారు. అలాగే మైదుకూరు ఎమ్మెల్యే  పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి టీడీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని భరోసా కల్పించారు.

 

కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వీరభద్రుడు, నాయిని పెద్దన్న, టీఎన్‌టీయూసీ పట్టణ అధ్యక్షులు పి. కమాల్ బాషా, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి రాకెట్ రఫీ, మైదుకూరు నియోజకవర్గ ఐటీడీపీ ఉపాధ్యక్షులు షేక్ ఆసిఫ్ హుస్సేన్‌తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ శ్రేణులు కృషి చేస్తున్నట్లు నాయకులు తెలిపారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!