మైదుకూరు 5వ వార్డులో ఘనంగా ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమం
సలాం ప్రొద్దుటూరు (మైదుకూరు): మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు మైదుకూరు మున్సిపాలిటీ 5వ వార్డులో ‘ఇంటింటికి టీడీపీ’ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వార్డు ఇన్‌చార్జ్ షేక్ అల్తాఫ్ హుస్సేన్, నాయిని శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనాలను నాయకులు...