–కౌన్సిలర్ నుంచి జెడ్పీటీసీ వరకు పోటీ చేయాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలి
–మాదాసు మురళి
సలాం ప్రొద్దుటూరు:
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ పూర్తి బయోడేటాను పార్టీ కార్యాలయంలో అందజేయాలని జనసేన పార్టీ స్థానిక ఎన్నికల సమన్వయకర్త మాదాసు మురళి తెలిపారు.స్థానిక నందిని క్లాత్ మార్కెట్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి పార్టీ తరఫున అవకాశం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.కౌన్సిలర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ పూర్తి వివరాలతో కూడిన బయోడేటాను పార్టీ కార్యాలయానికి స్వయంగా వచ్చి అందజేయవచ్చని, లేదా స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ సభ్యులకు సమర్పించవచ్చని సూచించారు.ఆశావహులు సమర్పించిన బయోడేటాలను పార్టీ అధిష్ఠానం పరిశీలించిన అనంతరం, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు అభ్యర్థులను ప్రకటిస్తారని మాదాసు మురళి వెల్లడించారు.ఈ సమావేశంలో సమన్వయకర్త బాబ్జి, సపోర్ట్ సభ్యుడు సోహెబ్, జిల్లా సేవాదళ్ సభ్యుడు అల్లం చంద్రశేఖర్, జనసేన యువ నాయకులు వరికుట్టి నాగార్జున, హరీష్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
