ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్19వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిగా అబ్దుల్అజీజ్‌ ప్రకటన..

19వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిగా అబ్దుల్అజీజ్‌ ప్రకటన..

📰 Generate e-Paper Clip

 

–అజీజ్‌ కుటుంబానికి అండగా ఉంటాం.. కష్టసుఖాల్లో తోడుంటాం

–వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 

 

సలాం ప్రొద్దుటూరు:

 

రానున్న మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 19వ వార్డు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌ అభ్యర్థిగా ఎర్రబల్లి అబ్దుల్ అజీజ్‌ పేరును వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం స్థానిక ఖాదర్ హుస్సేన్ మస్జిద్ వీధి లో స్వర్గస్తులు మాజీ కౌన్సిలర్ ఎర్రబల్లి అబ్దుల్ హమీద్ కుమారులు అబ్దుల్ అజీజ్, అబ్దుల్ ఖాలీక్ , 40 టీడీపీ కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ లో చేరారు.విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్నికల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొంటూ, అజీజ్‌ కుటుంబానికి పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా నాయకుడు మాట్లాడుతూ, స్వర్గస్తులు మాజీ కౌన్సిలర్ ఎర్రబల్లి అబ్దుల్ హమీద్ మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, వివాదాలకు దూరంగా ఉంటూ అందరితో సత్సంబంధాలు కలిగిన మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. రాజకీయ జీవితంలో తనదైన ప్రత్యేకతతో ముందుకు సాగిన అజీజ్‌కు మంచి అవకాశాలు కల్పిస్తామని, ఆయన కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు.తన కుటుంబంతో పాటు జగన్‌ అన్న కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలందరూ అజీజ్‌, ఆయన సోదరులు, కుటుంబ సభ్యులను తమ సోదరులుగా భావిస్తారని అన్నారు. కష్టసుఖాల్లోనూ, బాధల్లోనూ, గౌరవ మర్యాదల విషయంలోనూ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు. అజీజ్‌ కుటుంబ సభ్యుల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా అండగా నిలుస్తామని అందరి సమక్షంలో హామీ ఇచ్చారు.అజీజ్‌తో పాటు ఆయన సోదరులు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అల్లాహ్‌ ఆశీస్సులతో ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రజలకు సేవ చేసే అవకాశం లభించాలని ఆకాంక్షించారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో 19వ వార్డు నుంచి అజీజ్‌ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.మున్సిపాలిటీలో మొత్తం 52 వార్డులు ఉండగా, 19వ వార్డు నుంచి నామినేషన్‌ దాఖలు చేయడానికి విజయదశమి రోజును శుభప్రదమైన సందర్భంగా ఎంచుకున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యుల సహకారంతో ఎన్నికల ప్రక్రియలో ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!