ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రొద్దుటూరు నూతన ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం

ప్రొద్దుటూరు నూతన ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం

📰 Generate e-Paper Clip

 

– ప్రారంభించిన  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

 

సలాం   ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి శుక్రవారం  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

 

వీఎస్ ముక్తియార్ స్వగృహంలో తేనీటి విందు

 

నూతన బస్టాండ్ ప్రారంభోత్సవం అనంతరం రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీఎస్ ముక్తియార్ ఆహ్వానం మేరకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆయన స్వగృహానికి వెళ్లి తేనీటి విందును స్వీకరించారు.

 

పాల్గొన్న ప్రముఖులు

 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఏపీఎస్‌ఆర్టీసీ జేఎండీ శివప్రసాద్, ఏపీఎస్‌ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, ఏపీఎస్‌ఆర్టీసీ ఈడీ కిషోర్, ఆర్ఎం రమేష్ బాబు, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీఎస్ ముక్తియార్, టీడీపీ యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యులు తోట మహేశ్వర రెడ్డి పాల్గొన్నారు.అలాగే రాష్ట్ర డైరెక్టర్లు నల్లబోతుల నాగరాజు, బేపారి జాకీర్ అహమ్మద్, పేట చంద్రశేఖర్, శ్రీనివాసాచారి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఈవీ సుధాకర్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి కోనేటి ప్రదీప్ రెడ్డి, మాజీ సర్పంచ్ శివచంద్రా రెడ్డి, జనసేన నాయకుడు సుంకర మురళి, ప్రొద్దుటూరు డిపో డీఎం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!