ePaper
Sunday, October 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

 

–సభా ప్రాంగణం, పార్కింగ్‌, హెలిప్యాడ్‌ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

 

సలాం ప్రొద్దుటూరు:

 

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 5న ప్రొద్దుటూరులో పర్యటించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి జిల్లా అధికారులతో కలిసి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.జమ్మలమడుగు బైపాస్‌ రోడ్డులోని బొల్లవరం తిమ్మయ్య కళ్యాణమండపం పక్కన ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణం, మున్సిపల్‌ లేఅవుట్‌లోని పార్కింగ్‌ ప్రాంతం, హెలిప్యాడ్‌ ప్రాంగణాలను ఎమ్మెల్యే పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్‌, రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్‌, పార్కింగ్‌, ట్రాఫిక్‌, భద్రత తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సూచించారు.ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌, జేసీ నిధిమీనా తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!