ePaper
Friday, October 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పేదల సేవలో 2.0కు శ్రీకారం

పేదల సేవలో 2.0కు శ్రీకారం

📰 Generate e-Paper Clip

 

 

–పేదరిక నిర్మూలనకు P4–జీరో పావర్టీ కార్యక్రమం..

–ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన

 

సలాం   ప్రొద్దుటూరు:

ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు మరింత చేరువ చేయడంతో పాటు పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపడుతున్న “పేదల సేవలో 2.0” కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, సేవలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

P4తో పేదరిక నిర్మూలనకు చర్యలు

కార్యక్రమంలో యంగ్ ప్రొఫెషనల్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ P4 (Zero Poverty) కార్యక్రమం లక్ష్యాలను వివరించారు. పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించి, వారి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు, ఉపాధి అవకాశాలను అనుసంధానం చేయడం ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.రాబోయే 15 నెలల పాటు ప్రతి నెలా “పేదల సేవలో” కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు, P4 కార్యక్రమంపై నిరంతర అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రొద్దుటూరు MPDO సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ పాలనకు మరింత చేరువ కావాలని సూచించారు. సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకుని అర్హత మేరకు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు PGRSను వినియోగించుకోవాలని సూచించారు.రాజుపాలెం MPDO సురేష్ మహిళా శక్తి, మహిళా సాధికారతపై వివరించారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని తెలిపారు.కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ సి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న రుణ సదుపాయాలను వినియోగించుకుని చిన్నతరహా వ్యాపారాలు ప్రారంభించి స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేరాలి

మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి, సామాజిక భద్రత కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరించారు. ఆహార భద్రత, ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, ఉపాధి–స్వయం ఉపాధి, గృహ వసతి, సామాజిక భద్రత, ఆర్థిక సహాయం వంటి రంగాల్లో అందుబాటులో ఉన్న పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రజలు తమకు సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలను సంప్రదించి పథకాల అర్హతలు, అవసరమైన పత్రాల వివరాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబం తనకు అందాల్సిన ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు.

ఉచిత శిక్షణకు అవకాశం

ఈ సందర్భంగా మార్గదర్శి–కె.సి. పుల్లయ్య ఫౌండేషన్కు చెందిన గురు బ్రహ్మణయ్యను సత్కరించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆసక్తి ఉన్న వారికి ఉచిత టైలరింగ్, బ్యూటీషియన్, ట్యాలీ తదితర కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శిక్షణ పొందాలని కోరారు.“పేదల సేవలో 2.0” ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ఏర్పాట్లను పర్యవేక్షించి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌కు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో CSO, మున్సిపల్ కమిషనర్, DPO, DLDO, MPDOలు, మార్గదర్శులు, CVAPU సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!