స్వర్ణ వార్డు సచివాలయంలో జిల్లా టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
–ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతపై అధికారుల పరిశీలన.. –గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని నడింపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఆదర్శనగర్ స్వర్ణ వార్డు సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం మంగళవారం తనిఖీలు నిర్వహించింది. పట్టణ స్థాయిలో ప్రజలకు అందుతున్న వైద్య, ఆరోగ్య సేవల నాణ్యతను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.జిల్లా గణాంక అధికారి రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో గర్భిణుల ముందస్తు నమోదు, రక్తపోటు...