గోపవరం ఎంపీయూపీ స్కూల్‌లో ఎస్‌ఎంసీ కమిటీ ఏకగ్రీవ ఎన్నికలు

–చైర్మన్‌గా వెంకటేశ్వరరావు.. వైస్‌చైర్మన్‌గా సుధారాణి  –నూతన కమిటీని సన్మానించిన మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ పట్నం లక్ష్మణ్‌ సలాం  ప్రొద్దుటూరు: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం గోపవరం ఎంపీయూపీ స్కూల్‌లో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌గా వెంకటేశ్వరరావు, వైస్‌చైర్మన్‌గా సుధారాణిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్‌, వైస్‌చైర్మన్‌లను మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ పట్నం లక్ష్మణ్‌ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతుల కల్పనకు ఎస్‌ఎంసీ కమిటీ సమన్వయంతో...