రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా వ్యాసరచన పోటీలు
–వైవిధ్యంలో ఏకత్వం.. సర్దార్ పటేల్ సేవలపై విద్యార్థులకు అవగాహన –120 మంది విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనడం.. విజేతలకు నగదు బహుమతులు, ప్రతి విద్యార్థికి స్టీల్ వాటర్ బాటిల్ సలాం ప్రొద్దుటూరు: రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను పురస్కరించుకుని ప్రొద్దుటూరు మండల పరిధిలోని వివిధ ఉన్నత పాఠశాలల్లో 9వ, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన పోటీలను ఘనంగా నిర్వహించారు. పద్మశాలీయ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఏఎస్పీ శ్రీ విభూ కృష్ణ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.రోటరీ క్లబ్...