ePaper
Saturday, September 26, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్గయబ్‌షా కొండపై ఆధ్యాత్మిక వైభవం.. దస్తగిరి స్వామి 11వ షరీఫ్‌కు పోటెత్తిన భక్తజనం

గయబ్‌షా కొండపై ఆధ్యాత్మిక వైభవం.. దస్తగిరి స్వామి 11వ షరీఫ్‌కు పోటెత్తిన భక్తజనం

📰 Generate e-Paper Clip

 

–ఫకీర్ల మేళ మధ్య భక్తిశ్రద్ధలతో జెండా ప్రతిష్ఠ.. వేలాదిమందికి అన్నదానం.. అలరించిన ఖవ్వాలి

 

–సయ్యద్ ఇమామ్ హుస్సేన్ చిస్తీ ఉల్ ఖాద్రి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు.. శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రత్యేక ప్రార్థనలు

సలాం ప్రొద్దుటూరు–మైలవరం:

మైలవరం డ్యామ్ సమీపంలోని గయబ్‌షా కొండపై దస్తగిరి స్వామి 11వ షరీఫ్ వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక ఉత్సాహంతో ఘనంగా నిర్వహించారు. హజరత్ సయ్యద్ షా పీర్ గైబుసా వలి స్వామి దర్గా పరిసరాలు భక్తజన సందోహంతో కళకళలాడాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.సయ్యద్ ఇమామ్ హుస్సేన్ చిస్తీ ఉల్ ఖాద్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ షరీఫ్ వేడుకలు ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నాయి. దర్గా వద్ద భక్తులు పూల చాదర్లు, అత్తర్ సమర్పించి భక్తి భావాలను చాటుకున్నారు. దస్తగిరి స్వామి ఆశీస్సులు పొందేందుకు భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఫకీర్ల మేళ మధ్య జెండా ప్రతిష్ఠ

11 వి షరీఫ్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జెండా ప్రతిష్ఠ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. ఫకీర్ల మేళ, ఆధ్యాత్మిక నినాదాల మధ్య భక్తులు పెద్ద జెండాలను భుజాలపై మోసుకుంటూ తీసుకొచ్చారు. అనంతరం సంప్రదాయబద్ధంగా దస్తగిరి స్వామి జెండాను జెండా చెట్టు వద్ద ప్రతిష్ఠించారు.జెండా ప్రతిష్ఠ సందర్భంగా దర్గా పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. భక్తులు ప్రార్థనలు చేస్తూ తమ మనసులోని కోరికలను స్వామి సన్నిధిలో నివేదించారు.

వేలాదిమందికి అన్నదానం

11 వి షరీఫ్ సందర్భంగా సయ్యద్ ఇమామ్ హుస్సేన్ చిస్తీ ఉల్ ఖాద్రి ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కులమత భేదాలకు అతీతంగా భక్తులు అన్నదానంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. సేవా భావంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.

ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తిన ఖవ్వాలి

వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఖవ్వాలి కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది. ఖవ్వాలి గాయకుల ఆధ్యాత్మిక గీతాలు, సూఫీ సందేశాలతో గయబ్‌షా కొండ పరిసరాలు మార్మోగాయి. భక్తులు ఆసక్తిగా ఖవ్వాలి కార్యక్రమాన్ని వీక్షించారు.

శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రత్యేక ప్రార్థనలు

ఈ సందర్భంగా సయ్యద్ ఇమామ్ హుస్సేన్ చిస్తీ ఉల్ ఖాద్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సమాజంలో శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం నెలకొనాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.అలాగే హజ్రత్ సయ్యద్ షా జలాలీ పీర్ గైబుసా వలి చిస్తీ ఉల్ ఖాద్రి సాహెబ్ సన్నిధిలో భక్తులు పూల చాదర్లు, అత్తర్ సమర్పించారు. ప్రత్యేక ఫాతిహా, దువా కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.దస్తగిరి స్వామి 11వ షరీఫ్ సందర్భంగా నిర్వహించిన జెండా ప్రతిష్ఠ, అన్నదానం, ఖవ్వాలి, ప్రత్యేక ప్రార్థనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొత్తం గయబ్‌షా కొండ భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!