ePaper
Saturday, September 26, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్దస్తగిరి స్వామి పవిత్ర జ్ఞాపికల దర్శనానికి పోటెత్తిన భక్తజనం!

దస్తగిరి స్వామి పవిత్ర జ్ఞాపికల దర్శనానికి పోటెత్తిన భక్తజనం!

📰 Generate e-Paper Clip

–భక్తి పారవశ్యంతో జమ్మలమడుగు.. కన్నుల పండుగగా పవిత్ర జ్ఞాపికల ప్రదర్శన

–గార్మీ పండుగ సందర్భంగా 800 మందికి ఘనంగా అన్నదానం

సలాం ప్రొద్దుటూరు –   జమ్మలమడుగు:

జమ్మలమడుగు పట్టణంలోని మెయిన్ బజార్ వీధిలో గల జామియా మసీదులో దస్తగిరి స్వామి గార్మీ పండుగ సందర్భంగా గురువారం సాయంత్రం పవిత్ర జ్ఞాపికల ప్రదర్శన భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ పాషా ఖాద్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.పవిత్ర జ్ఞాపికలను దర్శించుకునేందుకు ముస్లిం సోదరులు, సోదరీమణులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక ఫాతిహా నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రత్యేక ఫాతిహా నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

 ప్రార్థనలతో మార్మోగిన జామియా మసీదు

పవిత్ర జ్ఞాపికల దర్శనం అనంతరం మగ్రిబ్ నమాజ్ తరువాత జామియా మసీదులో గార్మీ పండుగ సందర్భంగా సుమారు 800 మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. మటన్ బిర్యానీతో అన్నప్రసాదాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో గురువులు సయ్యద్ షా అసద్ పాషా ఖాద్రి, గౌస్ భాషా ఖాద్రి, మోసిన్ పాషా ఖాద్రి, యాసిన్ పాషా ఖాద్రి, నయీమ్ పాషా ఖాద్రితో పాటు కుటుంబ సభ్యులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.భక్తుల ప్రార్థనలు, ఫాతిహాలతో జామియా మసీదు పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. గార్మీ పండుగ సందర్భంగా నిర్వహించిన పవిత్ర జ్ఞాపికల ప్రదర్శన, అన్నదానం భక్తులను ఆకట్టుకుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!