–ఆరేళ్ల స్పెషల్ గ్రేడ్ పోస్ట్ ఇంక్రిమెంట్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు..
–నోషనల్ ఇంక్రిమెంట్, పదోన్నతులపై జాప్యం వద్దు
–జె.రామసుబ్బయ్య యాదవ్
సలాం ప్రొద్దుటూరు:
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆరేళ్ల స్పెషల్ గ్రేడ్ పోస్ట్ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.7 విడుదల చేయడంపై ప్రొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు, జేఏసీ చైర్మన్ జె.రామసుబ్బయ్య యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎన్జీవో హోంలో సుమారు 100 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సమావేశమై ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 5న ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉత్తర్వులు విడుదల కావడం పట్ల ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్జీవో సంఘం చొరవతో సమస్యకు పరిష్కారం
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సచివాలయ ఉద్యోగుల ఆరేళ్ల స్పెషల్ గ్రేడ్ పోస్ట్ ఇంక్రిమెంట్ అంశాన్ని పరిష్కరించడంలో ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ చొరవ కీలకమని రామసుబ్బయ్య యాదవ్ పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్‌తో పాటు పదోన్నతులు కల్పించే విషయంలో ప్రభుత్వం జాప్యం చేయకుండా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎన్జీవో సంఘం చేస్తున్న కృషికి ఉద్యోగులందరూ మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
నాయకత్వానికి కృతజ్ఞతలు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు, జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి. రమణ, కడప జిల్లా అధ్యక్షులు బి.శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.ప్రసాద్ యాదవ్ తదితరులకు జె.రామసుబ్బయ్య యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో సెక్రటరీ ఇ.ప్రమీల, కోశాధికారి సదాశివయ్య, వైస్ ప్రెసిడెంట్లు నాగార్జున, వరప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రభంజన్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ సుజాత, ఉమెన్ వింగ్ చైర్మన్ అరుణాదేవి, ఓంకార్, నరసింహ, పీరయ్య, కిరణ్, వెంకటనారాయణతో పాటు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

