

–18వ వార్షికోత్సవం సందర్భంగా 600 మందికి మహా అన్నదానం
– పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
సలాం ప్రొద్దుటూరు:
పట్టణంలోని 20వ వార్డు బాల ఒబాగారి వీధిలో శ్రీ బాల వినాయక ఉత్సవ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ బాల వినాయక ఉత్సవాల 18వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.అనంతరం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో సుమారు 600 మంది భక్తులు, వార్డు ప్రజలు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరై వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో 20వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి బేపారి ఆరీఫ్ అహమ్మద్, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి వైఎస్ జాబివుల్ల తదితరులు పాల్గొన్నారు.ఉత్సవ కమిటీ సభ్యులు ఆళ్లగడ్డ వెంకటేశ్వరులు, ఆళ్లగడ్డ హేమంత్ కుమార్, తాళ్లం లిఖిత్ కుమార్, నూకనబోయిన ఓబయ్య, నూకనబోయిన గణేష్, కొబాకు భార్గవ్ కృష్ణ, తంగాటూరు హాసిక తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొని కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్నదానానికి వచ్చిన భక్తులు, అతిథులు, వార్డు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.18 సంవత్సరాలుగా భక్తి, ఐక్యత, సేవాభావంతో వినాయక ఉత్సవాలను నిర్వహిస్తూ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు.ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన శ్రీ బాల వినాయక ఉత్సవ యూత్ అసోసియేషన్ సభ్యులను నిర్వాహకులు అభినందించారు. కార్యక్రమానికి సహకరించిన దాతలు, భక్తులు, 20వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో టైలర్ బాషా, రఫీ, లక్ష్మీదేవి, కొండమ్మ తదితరులు పాల్గొన్నారు.

