ePaper
Wednesday, September 16, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్సీబీఐటీలో ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు

సీబీఐటీలో ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు

📰 Generate e-Paper Clip

 

 

సలాం  ప్రొద్దుటూరు –చాపాడు:

 

చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) లో మంగళవారం ఇంజినీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోలి రాజేష్ మాట్లాడారు. డిగ్రీ సాధించడమే లక్ష్యం కాకుండా.. సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపే ఇంజినీర్లుగా ఎదగాలి అని  సూచనలు ఇచ్చారు.దేశ అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న ఆయన.. నీటి వనరుల సంరక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమాజాభివృద్ధి వంటి రంగాల్లో ఇంజినీర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా ఎస్ శృతి మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యను కేవలం ఉద్యోగ సాధనకు పరిమితం చేయకుండా, సమాజ నిర్మాణానికి ఉపయోగపడేలా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు, పరిశోధనలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డా. వి. జయచంద్ర రెడ్డి, సీఈఓ వి. లోహిత్ రెడ్డి, డైరెక్టర్ అడ్మిన్ డా. జి. శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!