ePaper
Saturday, September 19, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమృతనగర్‌లో వినాయకుడికి రాచమల్లు ప్రత్యేక పూజలు

అమృతనగర్‌లో వినాయకుడికి రాచమల్లు ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

 

–అన్నదాన కార్యక్రమంలో భక్తులకు భోజనం వడ్డించిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

 

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు మండలం అమృతనగర్‌లో వైఎస్సార్‌సీపీ నాయకుడు నూర్ బాషా (గోరె) మరియు ఆయన మిత్రులు ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా మండపంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు.వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని అమృతనగర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానికంగా భక్తులు, యువత పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు.కార్యక్రమంలో అమృతనగర్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు తిరుపాల్‌రెడ్డి, చికెన్ బాషాతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. నిర్వాహకులు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిని ఆహ్వానించి ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!