–వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
సలాం ప్రొద్దుటూరు –కామనూరు:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కామనూరు గ్రామంలో వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వినాయక ఉత్సవ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. గ్రామ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనేలా ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
