–ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన టీడీపీ నాయకులు
సలాం ప్రొద్దుటూరు –మైదుకూరు:
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు మైదుకూరు మున్సిపాలిటీ 5వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో “ఇంటింటికీ టీడీపీ” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.
టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించడంతో పాటు.. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో మైదుకూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో 101వ బూత్ ఇన్‌చార్జి కమాల్ బాషా, ఐటీడీపీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్ ఆసీఫ్ హుస్సేన్, తెలుగు యువత పట్టణ ఉపాధ్యక్షుడు శివరాం తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
