ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. టీడీపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. టీడీపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం

📰 Generate e-Paper Clip

స్థానిక ఎన్నికల్లో బీసీలకు మరిన్ని రాజకీయ అవకాశాలు

– టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్

సలాం ప్రొద్దుటూరు:

రాష్ట్రంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీసీ వర్గాలకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించే కీలక నిర్ణయమని టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ అన్నారు. బీసీలకు ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను 34 శాతానికి పెంచడం ద్వారా రాజకీయంగా వెనుకబడిన బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం పెరుగుతుందని ఆయన అన్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, సర్పంచ్, ఎంపీపీ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లతో అనేక మంది బీసీ నాయకులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభిస్తుందని తెలిపారు.

బీసీలకు టీడీపీ ఎప్పుడూ అండగానే..

ఎన్టీఆర్‌ కాలం నుంచి తెలుగుదేశం పార్టీ బీసీల అభ్యున్నతికి కృషి చేస్తోందని రాజగోపాల్ యాదవ్ అన్నారు. “బీసీలకు టీడీపీ వెన్నెముక.. బీసీ అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీ” అనే నమ్మకం బీసీ సమాజంలో ఉందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా నామినేటెడ్ పదవులు, రాజకీయ అవకాశాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
34 శాతం రిజర్వేషన్లపై ఎలాంటి న్యాయపరమైన, రాజకీయపరమైన సవాళ్లు ఎదురైనా ప్రభుత్వం బీసీల ప్రయోజనాలను కాపాడేందుకు చిత్తశుద్ధితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికలు 34 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూనే నిర్వహించాలన్నదే బీసీ సమాజం ఆకాంక్ష అని తెలిపారు.

50 శాతం రిజర్వేషన్లపై ఆశాభావం

రాష్ట్రంలో బీసీల జనాభా 50.42 శాతంగా ఉన్నట్లు సమగ్ర సర్వేలో వెల్లడైన నేపథ్యంలో భవిష్యత్తులో జనాభా ప్రాతిపదికన బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాజగోపాల్ యాదవ్ కోరారు.
ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణిస్తూ, భవిష్యత్తులో బీసీలకు మరింత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే నిర్ణయాలు వస్తాయన్న నమ్మకం బీసీ సమాజంలో ఉందన్నారు.

రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి బీసీలు అండగా నిలవాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలంతా ఐక్యంగా నిలిచి తెలుగుదేశం పార్టీ, కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు బీసీ సమాజం అండగా నిలవాలని కోరారు.
“బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ప్రభుత్వం.. భవిష్యత్తులో బీసీలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలి. బీసీ సమాజం టీడీపీకి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని చల్లా రాజగోపాల్ యాదవ్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!