సీ ఎం సురేష్ నాయుడుకు పరామర్శ
–పోట్లదుర్తిలో స్వగృహానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న టీడీపీ యువనాయకుడు నంద్యాల కొండారెడ్డి సలాం ప్రొద్దుటూరు: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు సి.ఎం. సురేష్ నాయుడు ఇటీవల ప్రమాదవశాత్తు కిందపడటంతో కాలికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం పోట్లదుర్తి గ్రామంలోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను టీడీపీ యువనాయకుడు నంద్యాల కొండారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా సురేష్ నాయుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కొండారెడ్డి, త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో చురుగ్గా పాల్గొనాలని...