ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

📰 Generate e-Paper Clip

 

–ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ద్వారా మంత్రి నారా లోకేష్ దృష్టికి సమస్యలు తీసుకెళ్తాం–మార్కెట్‌యార్డ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్

 

సలాం  ప్రొద్దుటూరు:

STF ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశానికి ప్రొద్దుటూరు మార్కెట్‌యార్డ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సహకారంతో ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోందని లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన 14 డీఎస్సీలలో 11 డీఎస్సీలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగాయని ఆయన అన్నారు.ఉపాధ్యాయులు, ఉద్యోగుల సంక్షేమం పట్ల అత్యంత గౌరవ భావం కలిగిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి సమస్యకు త్వరలోనే పరిష్కార మార్గం లభిస్తుందని భరోసా ఇచ్చారు.ఉపాధ్యాయులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, వాటిని సంబంధిత ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సమావేశంలో STF ప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!